సాక్షి,తాడేపల్లి: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/uHLmS2I1Aw
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 25, 2026
రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సూర్య భగవానుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న ఈ రోజు సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే భక్తులు సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో నిలబడి పూజలు నిర్వహిస్తున్నారు.


