‘లూమ్‌2హోమ్’‌ పేరుతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం

Young Techies Use Their Skills To Help Market Ponduru khadi - Sakshi

పొందూరు ఖద్దరు ఆన్‌లైన్‌ విక్రయాల కోసం వెబ్‌సైట్‌

సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖద్దరు.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా రాజకీయ ప్రముఖులు దీనిని బాగా ఇష్ట పడతారు. ఇవన్ని నాణెనికి ఒక వైపు. పొందూరు ఖద్దరు ఎంత దర్జగా ఉంటుందో దాన్ని నేసే వారి బతుకులు అంత దీనంగా ఉంటాయి. ప్రాణం పెట్టి నేసిన బట్టలను అమ్ముకునే పరిజ్ఞానం కొరవడటంతో నేతన్నలు ఎంతో మోసపోతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలవడానికి కొందరు యువ టెకీలు ముందుకు వచ్చారు. పొందూరు ఖద్దరు ఉత్పత్తుల అమ్మకం కోసం ఓ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ రూపొందించారు. వివరాలు..  శ్రీకాకుళం జిల్లా పొందూరు ఫైన్‌ కాటన్‌కు ఎంతో గుర్తింపు. కానీ సరైన మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ తెలియకపోవడంతో నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిపై డాక్యుమెంటరీ రూపొందించాలని శ్రీకాకుళానికి చెందిన నలుగురు యువ టెకీలు పోగిరి జవాంత్ నాయుడు, సూరజ్ పోట్నురు, సైలేంద్ర, భరద్వాజ్ నేతన్నలను సంప్రదించారు. ఈ క్రమంలో నేతన్నల కుటుంబాలు రోజుకు కనీసం రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుసుకుని షాక్‌ అయ్యారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: ‘సిరి’సిల్ల మురుస్తోంది..!)

దానిలో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి గాను చేనేత కార్మికులను దీనిలో చేరేలా ప్రేరేపించారు. ప్రారంభంలో కొందరు ఎంపిక చేసిన కస్టమర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జశ్వంత్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘పొందూరు నేతన్నలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మమ్మల్ని కదిలించాయి. వారికి సాయం చేయాలని భావించాం. ఇందుకు గాను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ రూపిందించాము. దానిలో భాగంగానే ‘లూమ్‌2హోమ్’‌ వెబ్‌ పేజ్‌ క్రియేట్‌ చేశాం. ప్రస్తుతం దీన్ని రినోవేట్‌ చేస్తున్నాం. సోమవారం నుంచి అదనపు పేజీలతో అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top