‘జనసేన నాయకులు అన్యాయం చేశారు’

ఆ పార్టీ కార్యాలయం ఎదుట మహిళ నిరసన
సాక్షి, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట సునీత బోయ అనే మహిళ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు మోసం చేశారని, ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు సొంత డబ్బు ఖర్చు పెట్టానని, అయినా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని చెప్పారు. పార్టీ కోసం తాను ఖర్చు పెట్టిన రూ.60 వేల నగదు తిరిగి ఇచ్చేయాలన్నారు. మహిళలకు న్యాయం చేయలేని జనసేన అధినేత, నేతలు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని సునీత ప్రశ్నించారు. పోలీసులు విచ్చేసి ఆమెతో మాట్లాడారు. ఫిర్యాదు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు.
చదవండి: (ఓ దౌర్భాగ్యుడి క్రూరత్వం.. తల్లిని తన్ని.. పీకపై కాలితో తొక్కి..)
సంబంధిత వార్తలు