Woman Dead Body Found In Visaka Beach In Suspicious Condition - Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌లో వివాహిత డెడ్‌బాడీ కలకలం.. ఏం జరిగింది?

Apr 26 2023 10:31 AM | Updated on Apr 26 2023 11:48 AM

Woman Dead Body Found In Visaka Beach In Suspicious Condition - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో మహిళ డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. వైఎంసీఏ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. 

వివరాల ప్రకారం.. వివాహిత శ్వేత మంగళవారం మిస్‌ అయినట్టు న్యూపోర్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బుధవారం ఉదయం విశాఖ ట్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ మృతదేహాం లభ్యమైనట్టు సమాచారం వచ్చింది. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు. కానీ, మహిళ మృతదేహాంపై గాయాలు, ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.  

మరోవైపు.. శ్వేత భర్త ఐటీ ఉద్యోగి. ఆమె 5 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా శ్వేత మృతదేహాం లభ్యమైన ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్వేత ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement