మాస్టార్‌ కోసం నామినేషన్ల ఉపసంహరణ

Visakhapatnam Mamapa Candidates Withdraw Nomination For Teacher - Sakshi

మంప గ్రామంలో అరుదైన సంఘటన

సాక్షి, విశాఖపట్నం: మనిషి జీవితంలో తల్లితండ్రి తరువాతి స్థానం గురువుదే.. ఆ తర్వాతే దైవం. ఎందుకంటే అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు చదువు చెప్పి విద్యాబుద్దులు నేర్పి.. జీవితంలో మంచి మార్గంలో నడవడానికి.. ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. జీవితంలో మనం మంచి స్థాయిలో ఉన్నామంటే అందుకు తల్లితండ్రులతో పాటు గురువు కూడా కారణమే. అలాంటి మాస్టారుకు ఏమిచ్చినా తక్కువే. వారి రుణం తీర్చుకునే అవకాశం లభించడమే అదృష్టం. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది కొందరు గ్రామస్తులకి. గురువు మీద అభిమానంతో వారు చేసిన పనిని అందరు ప్రశంసిస్తున్నారు. 

ఆ వివరాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు. ఈ క్రమంలో కొయ్యూరు మండలం మంప గ్రామంలో స్కూల్‌ టీచర్‌గా పని చేసిన ఇంగువ త్రినాథ్ పడాల్ సర్పంచ్‌గా బరిలో నిలిచారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువు పట్ల కృతజ్ఞతగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఉపాధ్యాయుడు ఇంగువ త్రినాధ్‌ పడాల్‌ మంప గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. 

చదవండి: ఓటర్ల దీవెన.. సర్పంచ్‌లుగా ముగ్గురు వలంటీర్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top