విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం | Vijayawada: Police High Handedness Against Farmers | Sakshi
Sakshi News home page

విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం

Jun 30 2026 1:07 PM | Updated on Jun 30 2026 1:21 PM

Vijayawada: Police High Handedness Against Farmers

సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్‌లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్‌లో రైతులపై పోలీసులు పిడిగుద్దలు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.

అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement