వైఎస్‌ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు | Vijayanagara District Nandipura Pitadhipathulu Meets Meets Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు

Mar 6 2025 12:22 PM | Updated on Mar 6 2025 1:40 PM

Vijayanagara District Nandipura Pitadhipathulu Meets Meets Ys Jagan

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు కలిశారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్‌ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

వైఎస్‌ జగన్‌కు పీఠాధిపతులు శ్రీ డా.మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), శ్రీ ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్‌, సండూర్‌) ఆహ్వానపత్రిక అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంఎల్‌సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌, రామచైతన్య (ఫౌండర్‌, అర్ధనారీశ్వర ఫౌండేషన్‌), వీరేష్‌ ఆచార్య (కో-ఫౌండర్‌, అర్ధనారీశ్వర ఫౌండేషన్‌) పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement