‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం

మహిళా సాధికారతే లక్ష్యం: వాసిరెడ్డి పద్మ
ఒంగోలు అర్బన్/ఒంగోలు టౌన్: మహిళల భద్రతతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని శుక్రవారం ఒంగోలులో ఆమె ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌తో కలిసి మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ మహిళా మార్చ్‌లో దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల రక్షణ, సంక్షేమంపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు.
‘రాజమండ్రి ఘటన’పై కౌన్సెలింగ్
రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ తరగతి గదిలో ఇంటర్ చదువుతున్న మైనార్టీ తీరని బాలుడు ఓ బాలికకు తాళి కట్టడం అందరికీ ఒక షాకింగ్‌లా కనపడిందని, ఈ ఘటనపై ఇరుపక్షాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఒంగోలు ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఘటనపై అధికారులతో తాను మాట్లాడినట్లు చెప్పారు. రెస్క్యూ చేసి ఆ బాలికను ఒక హోమ్‌లో ఉంచుతామన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి