‘వైఎస్సార్‌కు నిజమైన వారసుడు వైఎస్‌ జగన్‌’ | Varudhu Kalyani Glowing Tribute to YSR | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌కు నిజమైన వారసుడు వైఎస్‌ జగన్‌’

Apr 9 2026 7:21 PM | Updated on Apr 9 2026 7:44 PM

Varudhu Kalyani Glowing Tribute to YSR

విశాఖ. దివంగత నేత వైఎస్సార్‌ పాలన అంతా కూడా ఒక స్వర్ణయుగమన్నారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రాష్ట్ర దశాదిశను మార్చిన నాయకుడు వైఎస్సార్‌ అని గుర్తుచేసుకున్నారు.  తండ్రి అడుగుజాడల్లో వైఎస్‌ జగన్‌ నడుస్తు‍న్నారని, వైఎస్సార్‌కు నిజమైన వారసుడు జగనేనన్నారు. ఆయన వారసుడిగా ప్రజలకు జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు వరుదు కళ్యాణి. 

మావిగన్‌కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని, ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్‌పై షర్మిల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  వారసత్వం అనేది నీకు నువ్వు అనుకుంటే రాదని, ప్రజలివ్వాలని షర్మిలకు చురకలంటించారు. మావిగన్‌కు వస్తున్న విశేష స్పందన ఓర్వలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా షర్మిల ఈ విమర్శలు చేస్తున్నారన్నారు. 

చంద్రబాబు స్క్రిప్ట్‌ మేరకే వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అవసరం వచ్చిన ప్రతీసారి షర్మిల బయటకొచ్చి మాట్లాడతారని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement