ఏప్రిల్‌ 1 నుంచి ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు | TTD Arjitha Seva Tickets for purchase through Electronic Dip from April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1 నుంచి ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు

Mar 23 2022 4:10 AM | Updated on Mar 23 2022 11:54 AM

TTD Arjitha Seva Tickets for purchase through Electronic Dip from April - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గతంలో ఇస్తున్న విధంగానే తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద ఉన్న కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది.

ఇందుకోసం భక్తులు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు చేసుకుంటే ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా ఎంపిక చేసి టికెట్లు కేటాయిస్తారు. అలాగే, భక్తులకు ఏప్రిల్‌ 1 నుంచి పీఏసీ–1 వద్ద అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement