World Space Week: అంతరిక్షంలోనూ అమోఘం

TS Governor Tamilisai Soundararajan Speaks World Space Program In Sriharikota - Sakshi

మహిళల పాత్రపై రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌

షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం 

సూళ్లూరుపేట: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో సైతం మహిళల పాత్ర అమోఘమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసించారు. చంద్రయాన్‌–2 వంటి ప్రయోగం ద్వారా భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చా రన్నారు. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని ఎంఆర్‌ కురూప్‌ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు.

అంతరిక్ష రంగంలో రాణిస్తున్న మహిళా శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. భవిష్యత్‌లో గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతున్న ఇస్రో.. అందులోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. గగన్‌యాన్‌ ప్రయోగంలో వ్యోమగాములుగా మహిళలను పంపించే ప్రయత్నం చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top