హిడ్మా ఎన్‌కౌంటర్‌తో వెన్నెముక విరిగిన మావోయిస్టు పార్టీ
చదివింది ఏడో తరగతే.. గిరిజన భాషలతోపాటు
హిందీ, ఇంగ్లిష్, తెలుగు, బెంగాలీపై పట్టు
రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో ఉద్యమానికి నేతృత్వం
సాక్షి, అమరావతి: ‘ఆపరేషన్ కగార్’తో కకావికలమైన మావోయిస్టు పారీ్టకి చివరి ఆశ కూడా ఆవిరైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు ఉద్యమం వెన్నెముక విరిగిపోయింది. పార్టీని దశాబ్దాలపాటు నడిపిన గణపతి పక్కకు తప్పుకోవడం.. అనంతరం ఉద్యమాన్ని దూకుడుగా నడిపించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఇక మిగిలిన ఒకే ఒక ఆశా కిరణం హిడ్మానే. నంబాల కేశవరావు అనంతరం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినా, పార్టీని దూకుడుగా నడిపించే క్రియాశీల బాధ్యత హిడ్మాకే అప్పగించారు. మిలటరీ ఆపరేషన్స్‌లో దిట్ట కావడంతోపాటు గిరిజనుడైన అతనికి దండకారణ్యంపై పూర్తి పట్టుంది. స్థానిక గిరిజనుల్లో విశేష ఆదరణ ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల్లో అత్యంత పిన్న వయసు్కడు కూడా. అందుకే ఆ పార్టీ హిడ్మాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ చివరి ఆశలు కూడా ఆరిపోయినట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ యంగ్ టర్క్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల్లో అత్యంత పిన్న వయసు్కడు హిడ్మానే. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో 1981లో ఆయన జని్మంచారు. కేవలం ఏడో తరగతి వరకే చదివిన ఆయన మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత వేగంగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. దండకారణ్య ప్రాంతాల్లో పట్టు సాధించినప్పటికీ మావోయిస్టు పారీ్టలో ఉన్నత స్థానాల్లో 90 శాతం మందికిపైగా గిరిజనేతరులే ఉండటం గమనార్హం. దాంతో మావోయిస్టు పారీ్టకి గిరిజన ముఖంగా హిడ్మా గుర్తింపు పొందారు. గిరిజన భాషలైన గొండు, సంతాలి, కోయ భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్, తెలుగు, బెంగాలీలలో ఆయనకు పట్టుంది.
బతికుంటే తదుపరి సుప్రీం కమాండరే..
ఆపరేషన్ కగార్‌తో తుడిచి పెట్టుకుపోతున్న మావోయిస్టు పార్టీ హిడ్మాపైనే భవిష్యత్ ఆశలు పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఒడిశా, మహారాష్ట్రల్లోని గిరిజన ప్రాంతాలు ఆయనకు కొట్టినపిండి. మిలటరీ ఆపరేషన్స్‌లో హిడ్మా వ్యూహ రచన, దాన్ని అమలు చేయడంపై మావోయిస్టు పారీ్టకి పూర్తి విశ్వాసం ఉంది. నంబాల కేశవరావు మావోయిస్టు సుప్రీం కమాండర్‌గా ఉండగానే హిడ్మా పారీ్టపై తిరుగులేని పట్టు సాధించాడు. అందుకే నంబాల కేశవరావు ఈ ఏడాది ఎన్‌కౌంటర్‌లో హతమైన తర్వాత హిడ్మాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని కూడా పరిశీలించారు. ఇంకా 45 ఏళ్ల వయసే కావడంతో అప్పుడే పార్టీ సుప్రీం కమాండర్ బాధ్యత అప్పగించకూడదని నిర్ణయించారు.
అందుకే పార్టీ కేంద్ర కమిటీలో అత్యంత సీనియర్, తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గిరిజన ప్రాంతాల్లో పార్టీ తిరిగి పట్టు సాధించేలా చేయడం, మిలటరీ ఆపరేషన్స్ నిర్వహణపై నిర్ణయం, వ్యూహం, కార్యాచరణ అంతా హిడ్మానే చూసుకుంటారని చెబుతున్నారు. అంటే పార్టీ తర్వాత సుప్రీం కమాండర్ హిడ్మానేనని మావోయిస్టు పార్టీ స్పష్టమైన సంకేతం ఇచి్చంది. మావోయిస్టు పార్టీకి గణపతి, నంబాల కేశవరావు, దేవ్ జీ వరుసగా ముగ్గురు తెలుగు వారు ప్రధాన కార్యదర్శులు అయ్యారు. తర్వాత హిడ్మా పార్టీ సుప్రీం కమాండర్ అయ్యుంటే.. తొలిసారి తెలుగేతర మావోయిస్టు, అందులోనూ గిరిజనుడు మొదటిసారి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యేవాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ ఇక పూర్తిగా కొడిగట్టడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
మిలటరీ ఆపరేషన్స్‌లో దిట్ట
అగ్రనేత నంబాల కేశవరావుకు అత్యంత ప్రీతిపాత్రుడిగా హిడ్మా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిలటరీ ఆపరేషన్స్‌ను సమర్థవంతంగా నిర్వహించడంతో కేశవరావుకు శిష్యుడిగా చెప్పుకోవచ్చు. హిడ్మా గత 20 ఏళ్లలో 26 మిలటరీ ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించాడు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలపై మెరుపు దాడులకు పాల్పడ్డాడు. ఆ దాడుల్లో ఎంతో మంది పోలీసులు, రాజకీయ నేతలు మరణించారు. హిడ్మా నేతృత్వంలో మావోయిస్టు పార్టీ భద్రతా బలగాలపై చేసిన మెరుపుదాడుల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.
2007లో మావోయిస్టుల దాడికి హిడ్మా తొలిసారి నేతృత్వం వహించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని ఉర్పల్ మెట్ల ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడికి పాల్పడి ఆ పార్టీ అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించాడు.
2010లో దంతెవాడ జిల్లా తద్మెట్లలో చేసిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ పోలీసులు దుర్మరణం చెందడంతో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. ఆ దాడికి నేతృత్వం వహించడం ద్వారా హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారిపోయాడు.
2013 మేలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఝిరామ్ లోయలో దాడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో సవాల్ విసిరాడు. ఆ దాడిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుం ఉద్యమ సృష్టి కర్త, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మతోపాటు కాంగ్రెస్ అగ్రనేత వీసీ శుక్లా, నందకుమార్ తోపాటు 30 మంది దుర్మరణం చెందారు.
2017 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఆ దాడికి హిడ్మానే నేతృత్వం వహించాడు.
2021 మార్చిలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో హిడ్మా నేతృత్వంలో మావోయిస్టులు మాటువేసి కాల్పులతో విరుచుకుపడ్డారు. భద్రతా దళాల సభ్యులు 22 మంది మృత్యువాత పడటంతోపాటు 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకుని కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు గిరిజనుల ద్వారా తప్పుడు సమాచారం చేరవేయించి ఉచ్చులోకి లాగి మరీ మాటువేసి మెరుపు దాడి చేశాడు హిడ్మా.


