కూటమి సర్కార్‌ కక్ష సాధింపు.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్‌ | Three IPS Officers Suspended By AP Govt | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌ కక్ష సాధింపు.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్‌

Sep 15 2024 7:14 PM | Updated on Sep 16 2024 6:52 AM

Three IPS Officers Suspended By AP Govt

సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై నటి జత్వానీ ఆరోపణల నేపథ్యంలో తాజాగా ముగ్గురు ఐపీఎస్‌లపై కూటమి సర్కార్‌ సస్పెన్షన్‌ విధించింది. కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్య జీవోలు విడుదల విడుదల చేసింది.

కాగా, ముంబై నటి జిత్వానీ ఆరోపణలు చేశారన్న కారణంగా ముగుర్గు ఐపీఎస్‌లు సస్పెండ్‌ అయ్యారు. జిత్వానీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే ప్రభుత్వం ముగ్గురు అధికారులు సస్పెండ్‌ చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్య జీవోలు విడుదల చేయడం గమనార్హం. నటి జిత్వానీ ఆరోపణలతో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని స‍స్పెండ్‌ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఐపీఎస్‌లను సర్కార్‌ టార్గెట్‌ చేస్తూనే ఉంది. గత మూడు నెలలుగా వీరికి పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధింపులకు గురిచేసింది. ఇప్పుడు కూడా పోస్టింగ్‌ ఇవ్వకుండానే ఆరోపణల పేరుతో వేధింపు.. వారిని సస్పెండ్‌ చేసింది.

ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ‘కూటమి’ కుట్ర: బొత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement