‘క్యూలో ఎక్కువసేపు నిలబెట్టారు.. అందుకే తొక్కిసలాట’ | They Stood In The Queue For a Long Time Hence The Stampede SP' | Sakshi
Sakshi News home page

‘క్యూలో ఎక్కువసేపు నిలబెట్టారు.. అందుకే తొక్కిసలాట’

Jan 1 2023 9:07 PM | Updated on Jan 1 2023 9:37 PM

They Stood In The Queue For a Long Time Hence The Stampede SP' - Sakshi

గుంటూరు:  క్యూలో జనాన్ని ఎక్కువ సేపు నిలబెట్టిన కారణంగానే గుంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాద స్థలిని కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన తర్వాత ఎస్పీ మాట్లాడారు. ‘బారికేడ్డు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. మేం సరిపడా బందోబస్తు ఇచ్చాం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. ఫస్ట్‌ కౌంటర్‌ వద్దే ప్రమాదం జరిగింది. క్యూలో ఎక్కువసేపు నిలబెట్టారు. జనం ఒక్కసారిగా రావడంతోనే తొక్కిసలాట. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం’ అని ఎస్పీ పేర్కొన్నారు.

కాగా, ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందగా పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు.

చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

Advertisement
 
Advertisement
Advertisement