Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Telugu Trending News Breaking News Evening News Roundup 25th Sep 2022 - Sakshi

1. మూడు రాజధానులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే..
ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స
తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఆయన వివరించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కేసీఆర్‌ కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. సందర్భంగా వచ్చిన ప్రతీసారి రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌.. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుండగా.. బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లోని అశోక్ గహ్లోత్‌ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పట్టా
రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారి శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' ‍ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే..
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో చిరు పొలిటికల్‌ లీడర్‌గా కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 18న ఎన్నికలు జరగనుండగా..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా
ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ–20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. రాచకొండ పోలీసులు 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. బ్లాక్‌ దందా.. రూ.850 టికెట్‌ రూ.11,000
ఉప్పల్‌ స్టేడియం సమీపంలో బ్లాక్‌ టికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంకు సమీపంలో టికెట్లను విక్రయిస్తున్న గగులోత్‌ వెంకటేష్‌, ఇస్లావత్‌ దయాకర్‌, గగులోత్‌ అరుణ్‌ అనే ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top