Megastar Chiranjeevi GodFather Pre Release Event Date Fix - Sakshi
Sakshi News home page

God Father: చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' ‍ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే..

Published Sun, Sep 25 2022 3:36 PM

Chiranjeevi God Father Pre Release Event Date Fix - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో చిరు పొలిటికల్‌ లీడర్‌గా కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్‌5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జోరు పెంచిన మూవీ టీం తాజాగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌ చేస్తూ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈనెల 28న సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్‌ గ్రాండ్‌లా లాంఛ్‌ కానున్నట్లు మేకర్స్‌ తెలిపారు.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సత్యదేవ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement