మళ్లీ నోరు పారేసుకున్న కూన రవి కుమార్‌

TDP Leader Kuna Ravikumar Threatened Police - Sakshi

అధ్యక్ష పదవి రాగానే తిట్ల దండకం ప్రారంభం

ఈ సారి పోలీసులపై నోరు పారేసుకున్న మాజీ విప్‌

టీడీపీ నేతల వీరంగంతో నరసన్నపేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

సంయమనం పాటించిన పోలీసులు  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం /నరసన్నపేట: ‘జాగ్రత్త.. ఇలాగే ఉంటుందనుకుంటున్నారా.. లిస్టు ఎక్కిపోతే మీరు శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త... ఎవడక్కడ.. ఎవరాయ్‌ అక్కడ.. ఏంటీ మీరు డిస్కస్‌ చేసేది.. నువ్వు డిస్కస్‌ చేసేదేంటి? మీ స్థాయి ఎంత ..మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి మాజీ విప్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ నోరు పారేసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు సీఐ, ఎస్‌ఐలు నిశ్చేష్టులయ్యారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదా స్‌పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా పోలీస్‌ స్టేషన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా కోవిడ్‌ నిబంధనల మేరకు ముగ్గురే లోపలకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలంటూ పోలీసులు గేట్‌ను క్లోజ్‌ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన కూన రవికుమార్‌ తదితరులు పోలీసు లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కూన రవికుమార్‌ మరోమారు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. అయితే పోలీసులు సంయమనం పాటించారు. దీంతో వారంతా గేట్‌ వద్దే బైటాయించి పోలీసులపై దుర్భాషలాడారు. (చదవండి: ఆగని టీడీపీ నేత ‘కూన’ ఆగడాలు)

కూన రవికుమార్‌కి ఇదేమీ కొత్త కాదు. నోటి దురుసుతో మాట్లాడటం ఆయనకు అలవాటైపోయింది. ఆ మధ్య ఎంపీడీఓను, ఆ తర్వాత పంచాయతీ విస్తరణా«ధికారులు, వీఆర్‌ఓలను, తదుపరి తహసీల్దార్‌ను ఇష్టారీతిన తిట్టారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై బయట ఉన్నారు. కానీ ఆయన తీరులో మాత్రం మా ర్పు రాలేదు. ఇన్ని కేసులు, ఆరోపణలు ఉన్నా చంద్రబాబు ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో ఏకంగా పోలీసులపైనే విరుచుకుపడ్డారు. (చదవండి: అంతే వీరు.. మారదు తీరు

కూన బాగోతమిది 
పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లోనే వార్నింగ్‌ ఇచ్చారు. అంతకుముందు పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీని బెదిరించారు. పనుల విషయంలో తాను  చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అంటూ రెచ్చిపోయారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌ను బెదరింపులతో పాటు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. తాజాగా పోలీసులతోనూ ఇష్టారీతిన మాట్లాడారు. కరోనా నిబంధనల దృష్ట్యా గేటు వేస్తే వీరంగం సృష్టించారు. చివరికి ఉన్నతాధికారుల అనుమతి, శాంతి భద్రతల దృష్ట్యా కొద్ది మందిని పోలీసులు లోపలికి అనుమతించడంతో ఫిర్యాదు ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అశోక్, పార్టీ సీనియర్‌ నాయకులు కళా వెంకటరావు, మాజీ ఎమ్మెల్లే బగ్గు రమణమూర్తి, చౌదరి బాబ్జీలు ఉన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top