కొత్త మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులు | Special authorities for new municipalities | Sakshi
Sakshi News home page

కొత్త మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులు

Mar 25 2021 3:46 AM | Updated on Mar 25 2021 3:46 AM

Special authorities for new municipalities - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 5 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ తాడిగడప (కృష్ణా)కు విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, అల్లూరు నగర పంచాయతీ (నెల్లూరు జిల్లా)కు కావలి మునిసిపల్‌ కమిషనర్, బి.కొత్తకోట (చిత్తూరు)కు రాయచోటి మునిసిపల్‌ కమిషనర్, చింతలపూడి (పశ్చిమ గోదావరి)కి ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యదర్శి, పొదిలి (ప్రకాశం)కు ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించారు.  

Advertisement
 
Advertisement
Advertisement