ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి

Shravan Month Special Pujas In Vijayawada Durgamma Temple - Sakshi

అమ్మవారికి ప్రత్యేక పూజలు

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శుక్రవారం పెద్దసంఖ్యలో అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి వారం నుండే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. దుర్గమ్మని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇంద్రకీల్రాదిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

శ్రావణ శోభకు కరోనా దెబ్బ..
 శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. మహిళలు ఈ మాసం అత్యంత శుభ ప్రదమైనదిగా భావించి నోములు, వ్రతాలు నోచుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు తది తర శుభకార్యాలకు ఇది దివ్యమైన మాసం. ఈ నెల రోజులు నగరంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ప్రతి ఏడాది అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగుతాయి. అయితే కరోనా ఎఫెక్ట్‌తో శ్రావణం మూగబోయే పరిస్థితి నెలకొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top