Sakshi Telugu Breaking News: Telugu News Today 3rd August 2022 - Sakshi
Sakshi News home page

Morning Top 10 News: తెలుగు తాజా వార్తలు 10

Published Wed, Aug 3 2022 10:12 AM | Last Updated on Wed, Aug 3 2022 11:32 AM

Sakshi Telugu Breaking News Online Telugu News Today 3rd August 2022

1. మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్‌.. 4 రోజులు తిరక్కముందే
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభ్యర్థించి 4 రోజులు తిరక్కముందే ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆ పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన చీమల సునీత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి2. ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం.. తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ
ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆయన మాట్లాడారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. టీఆర్‌ఎస్‌కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్‌బై! బీజేపీలోకి ప్రదీప్‌రావు?
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చు­కోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యాక.. వరంగల్‌ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఇది మూసీనేనా..? స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్న జనం
ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్‌–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్‌ఘాట్, మూసారాంభాగ్‌ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు
డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్‌ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు
గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్‌
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడిన రోహిత్‌ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్‌హర్ట్‌గా క్రీజును వదిలాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సాంగ్‌ చూపించేశాం మావా... 
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్‌. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్‌. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్‌ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రూపాయి విలువ భారీగా పతనం.. ఆర్థికమంత్రి కీలక ప్రకటన
డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీ పతన ఆందోళనల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌ రూపాయి విలువ కుప్పకూలలేదని స్పష్టం చేశారు. అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్‌.. రూ.10 లక్షలకుపైనే సుపారీ! 
న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్‌ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్‌ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్‌కు ప్రణాళిక రచించిందెవరు?
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement