ఉద్యోగుల సంక్షేమం.. ప్రజా సంక్షేమంలో భాగమే

Sajjala Ramakrishnareddy Launched AP NGO Association Website - Sakshi

ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సంక్షేమం.. ప్రజా సంక్షేమంలో భాగమేనని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలన అనుభవం లేకున్నా.. సంక్షేమంలో ముందున్నామని, ఏడాదిన్నరలోనే ప్రపంచ, దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్లకుపైగా అప్పులు పెట్టి పోయింది. కోవిడ్‌ కట్టడిలో ఖర్చుకు వెనుకాడని ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: కావాలనే ఘర్షణ వైఖరి)

‘‘ప్రజా జీవనం కోవిడ్ కారణంగా స్తంభించింది. ఎవరికైనా సమాచారం చాలా ముఖ్యం. సమాచార వారధి ఉండటం చాలా అవసరం. నేను రాజకీయ నాయకుడిని కాదు. పరిష్కారం దిశగా ఏ సమస్య అయినా ఆలోచించగలగడానికి కారణం సీఎం జగన్ పట్టుదల. సీఎం జగన్ వెంట నడుస్తున్న వారిగా మేం అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ప్రభుత్వ విధానాలను అమలు చేసే యంత్రాంగం సమస్యలు తీర్చాలి. సీఎం జగన్ స్వేచ్ఛగా తాను అనుకున్నవి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.(చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top