
తిరుపతి,సాక్షి: దళితులంటే చంద్రబాబు (chandrababu)కు చులకన. ఆయన దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా (rk roja) హితవు పలికారు. చిత్తూరు జిల్లా నగరి తడుకు పేట దళితులుపై జరిగిన దాడి ఘటనపై శుక్రవారం ఆమె స్పందించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉంటే దళితులుపై ఎక్కువ దాడులు జరుగతాయనే నానుడిని నిజం చేస్తున్నారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ (ysrcp) కార్యకర్తల ఇళ్లను, ద్విచక్ర వాహనాల్ని దహనం చేశారు. చుండూరు, కారంచేడు తరహాలో నగరి నియోజకవర్గంలో తడుకు పేట ఘటన తలపిస్తోంది.
బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేయించడం, వారిపై హత్య యత్నం కేసులు పెడుతున్నారు. గత ఐదేళ్లలో ఈ తరహా ఘటనలు ఎన్నడూ జరగలేదు.
ఊరు విడిచి వెళ్ళాలని దళితుల్ని బెదిరిస్తున్నారు. వారిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. దళిత మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో దళితులుపై దాడులు జరుగుతున్నాయి. దళితులుకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది
చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వడం చేత కాదు. ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం రాదు. కుల రాజకీయాలు చేస్తూ దళితులుపై దాడి చేస్తున్నారు. పోలీసు అధికారులు ఈ ఘటనలో నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి’అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
👉చదవండి : ఏపీలో ఇకపై ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం