ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే..

Retired VRO Comes Home After Two And Half Years In YSR District - Sakshi

రెండున్నరేళ్ల తర్వాత ఇంటికి చేరిన రిటైర్డ్‌ వీఆర్‌ఓ

కమలాపురం: మండలంలోని టి.చదిపిరాళ్లకు చెందిన రిటైర్డ్‌ వీఆర్‌ఓ లింగాల రాఘవేంద్ర రావు రెండున్నరేళ్ల తర్వాత ఇంటికొచ్చాడు. మండలంలోని పలు గ్రామాల్లో వీఆర్‌ఓగా పనిచేసిన ఆయన నాలుగేళ్ల క్రితం రిటైర్డ్‌ అయ్యారు. అయితే పక్షవాతం రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆయన తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వివిధ చోట్ల గాలించి ఆశలు వదిలేశారు. ఇంటి నుంచి వెళ్లి దాదాపు రెండున్నరేళ్లవుతోంది.

శనివారం కమలాపురం పట్టణంలోని క్రాస్‌ రోడ్డులో రాఘవేంద్రరావు ఉన్నట్లు గ్రామ మాజీ సర్పంచ్‌ జయ సుబ్బారెడ్డికి సమాచారం వచ్చింది. ఆయన అక్కడకు చేరుకుని రాఘవేంద్రరావును ఇంటికి తీసుకెళ్లి భార్య లీలావతమ్మకు అప్పగించారు. ఆమె  భర్తను చూడగానే ఆనందపరవశమయ్యారు. ఎటు చూసినా కరోనా కాటేస్తోంది..ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. అని కన్నీటి పర్యంతమైంది. ఇన్నాళ్లు ఎక్కడున్నావని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడుగుతున్నప్పటికీ ఆయన సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఏదీ అడిగిన నమఃశివాయః అనడం తప్ప వేరే మాట మాట్లాడటం లేదు. రాఘవేంద్ర రావుకు ఒక వివాహిత కుమార్తె ఉన్నారు.

ఇవీ చదవండి:
పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని..
సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top