సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట | Relief For Vallabhaneni Vamsi In The Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

Jul 17 2025 11:44 AM | Updated on Jul 17 2025 12:04 PM

Relief For Vallabhaneni Vamsi In The Supreme Court

ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement