పాపం ద్రాక్షాయణి.. కుటుంబీకులు దూరమై.. ఏకాకిగా మిగిలి..!

Relatives Appealed Support For Orphaned Young Woman In Chittoor District - Sakshi

బ్లాక్‌ ఫంగస్‌తో తల్లి మృతి

రెండేళ్ల క్రితం సోదరుడు, ఏడాది క్రితం తండ్రి మృతి

ఒంటరిగా మిగిలిన ద్రాక్షాయణి

ఆదుకోవాలని కోరుతున్న బంధువులు 

పీలేరు రూరల్‌: విధి వైపరీత్యమంటే ఇదేనేమో..బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి తల్లి మృతి చెందగా, అంతకుముందు రెండేళ్ల కిందటే అనారోగ్యంతో ఆమె సో దరుడు, ఏడాది క్రితం తండ్రి మృతి చెందారు. దీంతో ఆమె ఏకాకిగా మిగిలి కన్నీరుమున్నీరవుతోంది. వైఎస్సార్‌ జిల్లా మైదకూరు మండలం సుంకలగారిపల్లెకు చెందిన డి.లక్ష్మీదేవి 2005లో ఏపీఎస్‌ ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి  ఆర్టీసీ నల్లగుట్టలో నివాసముంటూ పీలేరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. లక్ష్మీదేవి కుమారుడు చక్రధారి 2019 లో అనారోగ్యంతో మృతి చెందాడు.

చదవండి: పంథా మార్చి.. పట్టుబడిన కిలేడీలు 

ఏడాది క్రితం లక్ష్మీదేవి భర్త రమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడు, భర్తను కోల్పోయిన లక్ష్మీదేవి బాధను దిగమింగుకుంటూ కుమార్తె ద్రాక్షాయణితో కలిసి జీవనం సాగిస్తూ వచ్చింది. 20 రోజుల క్రితం లక్ష్మీదేవి కరోనా బారినపడి బ్లాక్‌ ఫంగస్‌కు గురై వే లూరు సీఎంసీలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల్లో ముగ్గురూ తన నుంచి దూరం కావడంతో ఏకాకిగా మిగిలిన ద్రాక్షాయణి కన్నీమున్నీరుగా విలపిస్తోంది. లక్ష్మీదేవి మృతదేహాన్ని వారి స్వగ్రామం సుంకలగారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్టీసీ సీఐ ధనుంజయలు దహనక్రియలకుగానూ రూ.15 వేలు అందజేశారు. ద్రాక్షాయణి ఇంటర్‌ పూర్తిచేసి ఎంసెట్‌లో 52 వేలు ర్యాంక్‌ సాధించింది. అనాథగా మిగిలిన ద్రాక్షాయణిని ఆదుకోవాలని ఆమె బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చదవండి: అత్యాచార వీడియో ఒకరి నుంచి ఒకరికి.. ఐదుగురికి యావజ్జీవం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top