ఏపీ ప్రజలకు కూటమి సర్కార్‌ మరో షాక్‌ | Registration Charges To Increase In Andhra Pradesh From February 1st | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్‌ మరో షాక్‌

Jan 30 2025 7:06 PM | Updated on Jan 30 2025 7:39 PM

Registration Charges To Increase In Andhra Pradesh From February 1st

ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్‌ షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు ఆదేశాలు జారీ చేసింది.

సాక్షి, విజయవాడ: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్‌ షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు ఆదేశాలు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉత్తర్వులు ఇవ్వడంతో.. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. అర్బన్, రూరల్ అన్ని ప్రాంతాల్లోనూ బాదుడుకు అనుమతులిచ్చింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెంచేందుకు నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్‌ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు జీవో కూడా జారీ చేసేసింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్‌) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది.

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అందులో భాగంగానే మార్కెట్‌ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్‌ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్‌మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.

ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement