రియల్‌ లైఫ్‌లోనూ ఆయన హీరోనే: సూపర్‌ స్టార్‌ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి | Real Hero Super Star Krishna Says YS Jagan on Birth Anniversary | Sakshi
Sakshi News home page

రియల్‌ లైఫ్‌లోనూ ఆయన హీరోనే: సూపర్‌ స్టార్‌ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి

May 31 2025 1:19 PM | Updated on May 31 2025 2:41 PM

Real Hero Super Star Krishna Says YS Jagan on Birth Anniversary

సాక్షి, గుంటూరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే జనాలకు మదిలో మెదిలే రూపం సూపర్‌ స్టార్‌ కృష్ణగారిదేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ఇవాళ(మే 31) కృష్ణ జయంతి(Krishna Birth Anniversary) సందర్భంగా నివాళులర్పిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారాయన.

సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు(Super Star Krishna Gaaru) హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా, ఎడిట‌ర్‌గా, స్టూడియో అధినేత‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 

అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజ‌కీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి(వైఎస్సార్‌) అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అంటూ జగన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement