breaking news
Remembering
-
పాటపాడుతూ నిర్మలా సీతారామన్ భావోద్వేగం
కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎనలేని ప్రతిభను, ఆమె సమాజానికి అందించిన అసమాన సేవలను స్మరించుకుంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె సంగీత ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, తాను భారతీయ సంస్కృతికి సాధికార రూపమని కొనియాడారు.సంగీత సాధన.. భక్తి తత్త్వంఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్రంలో వెల్లివిరిసే భక్తిరసం, శ్రోతలను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు. వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజనల ద్వారా ప్రతి ఇంటా ఆమె స్వరం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సుబ్బులక్ష్మి కేవలం ఒక గాయని మాత్రమే కాదని, భారతీయ మూలాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అని వ్యాఖ్యానించారు.VIDEO | Karnataka: Union Minister Nirmala Sitharaman gets emotional as she remembers legendary singer MS Subbulakshmi at an event in Bengaluru to mark her 110th birth anniversary. pic.twitter.com/bRtr565lXz— Press Trust of India (@PTI_News) September 16, 2026సామాజిక సేవకు సంగీతమే ఆయుధంతమ సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగాన్ని వివిధ సామాజిక కార్యక్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి ఉదారతను మంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. గాంధీజీతో ఆమెకున్న అనుబంధాన్ని, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రతిధ్వనించిన ఆమె గాత్రం దేశానికి తెచ్చిన ఖ్యాతిని గుర్తు చేస్తూ నిర్మలా సీతారామన్ కంటతడి పెట్టారు. కళ అనేది మానవతా దృక్పథాన్ని, సమాజ సంక్షేమాన్ని పెంచేదిగా ఉండాలనడానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆమె చూపిన బాట నేటి తరం కళాకారులకు, యువతకు నిరంతర ప్రేరణ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది! -
రాజువయ్యా.. మా రాజువయ్యా (ఫొటోలు)
-
మెగా డాటర్ నిహారిక ఫిబ్రవరి గడిచిందిలా (ఫొటోలు)
-
అత్తారిల్లు, భర్తతో టూర్స్.. నటి అభినయ ఆగస్ట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
ఆంధ్రకేసరి టంగుటూరి.. ప్రజల మనిషి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు. లక్షలాది రూపాయలు సంపాదించి, అంతా ప్రజల కోసమే ఖర్చు చేశారు. తన కోసం ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. నాటి లోక్‌సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఆయన ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ కొనియాడిన విధానాన్ని చూస్తే ప్రకాశం వ్యక్తిత్వం అర్థమవుతుంది– ‘మనం 1928లో సైమన్ కమిషన్‌ను బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళి పోయారు. ప్రకాశంగారు మాత్రం మిలిటరీ పోలీ సులు అడ్డుకోబోయి నప్పుడు చొక్కా విప్పి కాల్చమని తన ఛాతీని చూపించిన సాహసి అయ్యారు. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు’.ప్రకాశం మరణించినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన విశిష్టతను ఇలా ప్రశంసించారు: ‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది అనుయాయులు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడే కాదు, ఆయన భారత జాతీయోద్యమ నాయక శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’. ఇదీ చదవండి: అప్పుడే... ఏఐకి సార్థకతనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ... ‘నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం, సాహచర్యం ఉన్నాయి. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభ వించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసా భావంతోనే చూసేవాడిన’ని అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – డా‘‘ పి. మోహన్ రావుచైర్మన్, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
'కోర్ట్' శ్రీదేవి జూలై జ్ఞాపకాలు.. అటు ఫ్యామిలీ ఇటు కొత్త కారు (ఫొటోలు)
-
రియల్ లైఫ్‌లోనూ ఆయన హీరోనే: సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే జనాలకు మదిలో మెదిలే రూపం సూపర్ స్టార్ కృష్ణగారిదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ఇవాళ(మే 31) కృష్ణ జయంతి(Krishna Birth Anniversary) సందర్భంగా నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన.సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు(Super Star Krishna Gaaru) హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజకీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి(వైఎస్సార్) అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ జగన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
పూత రేకులు, కోనసీమ అందాలు.. అద్భుత జ్ఞాపకాలంటోన్న యాంకర్ వింధ్య విశాఖ (ఫోటోలు)
-
విలన్ని కూడా ఇష్టపడేలా చేశాడు.. ఈయన గొంతుకే సెపరేట్ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
దివంగత క్రికెటర్ హ్యూస్ గౌరవార్థం...
పెర్త్: ఆట ఆడే మైదానంలో ఆయువు కోల్పోయిన ఆ్రస్టేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు దశమ వర్ధంతి సందర్భంగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఘనమైన నివాళులు అరి్పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు ప్రారంభానికి ముందు సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం మృతి చెందిన తమ క్రికెటర్‌ను ఆ జట్టు తరఫున 13వ ప్లేయర్‌గా ఆ టెస్టు జాబితాలో చేర్చనుంది. అలాగే 63 సెకన్ల పాటు (చివరగా అతను చేసిన స్కోరు) ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అడిలైడ్ ఓవల్ మైదానం మార్మోగనుంది. దీంతోపాటు తమ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల పాటు ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లతో (ఆర్మ్‌బ్యాండ్) బరిలోకి దిగుతారు. ఈ మూడు మ్యాచ్‌లు జరిగే వేదికల వద్ద ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నట్లు సీఏ తెలిపింది. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్‌కు బలయ్యాడు. బుల్లెట్లా దూసుకొచి్చన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో ఉన్నపళంగా హ్యూస్ పిచ్‌పైనే నేలకొరిగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసినా... ఫలితం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన బ్యాటర్ తన పుట్టినరోజు (30)కు మూడు రోజుల ముందు నవంబర్ 27న తుదిశ్వాస విడిచాడు. ఈ దివంగత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆసీస్ తరఫున అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. -
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
డా. ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి అరుదైన ఫోటోలు


