పవన్ నా సినిమాలో ఫోజు కాపీ కొట్టారు | Ram Gopal Varma Tweets Pawan Kalyan Photo From Vyuham | Sakshi
Sakshi News home page

పవన్ నా సినిమాలో ఫోజు కాపీ కొట్టారు

Sep 10 2023 9:19 PM | Updated on Sep 10 2023 9:54 PM

Ram Gopal Varma Tweets Pawan Kalyan Photo From Vyuham - Sakshi

హైదరాబాద్:  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రామదూత క్రియేషన్స్ పతాకంపై తాను తెరకెక్కిస్తున్న చిత్రం 'వ్యూహం'లోని ఒక స్టిల్‌ను పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చేసి చూపించారంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. తన సినిమా స్టిల్స్‌తో పవన్ కళ్యాణ్ ఫోజులకు పోలిక పెడుతూ ఫోటోలను జతచేశారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించిన నేపథ్యంలో ఆయనను కలిసేందుకు హైడ్రామా నడిపాడు పవన్ కళ్యాణ్. మొదట ఫ్లైట్‌లో గన్నవరం వెళ్లి అటునుంచి విజయవాడ వెళదామనుకున్న ఆయనకి గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతి నిరాకరించింది. 

దీంతో రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించగా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఆయనను గరికపాడు చెక్‌పోస్టు వద్దే అడ్డుకున్నారు. అక్కడ అసలు డ్రామా శురూ చేసిన పవన్ కళ్యాణ్ రోడ్డుపైనే పడుకుని నానాయాగీ చేశారు. ఇదే క్రమంలో కాలుపై కాలు వేసుకుని పడుకున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

పవన్ కళ్యాణ్ గరికపాడు చెక్‌పోస్టు వద్ద రోడ్డు మీద ఇచ్చిన ఆ ఫోజులు నెల రోజుల క్రితం తాను తీస్తున్నట్టు ప్రకటించిన వ్యూహం చిత్రంలోనివంటూ ఫోటోల మధ్య పోలిక పెడుతూ నాకంటే గొప్పగా మనుషుల మనస్తత్వాలను అర్ధం చేసుకునే వారు ఎవరుంటారని 
కామెంట్ పెట్టారు.  

ఇది కూడా చదవండి: ‘స్కిల్డ్‌ క్రిమినల్‌ ఫస్ట్‌ టైమ్‌ చట్టానికి దొరికిపోయాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement