భోగాపురంలో అత్యధిక వర్షపాతం

Rain Forecast: 24 Hours Rainfall Recorded In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా భోగాపురంలో 11 సెంటిమీటర్లు, కొత్తవలసలో 10 సెంటిమీటర్లు, డెంకాడలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 

వేపాడ, మెంటాడ, జామి, పూసపాటిరేగ, బొండపల్లిలలో 7 సెంటిమీటర్లు నమోదు కాగా ఎల్ కోట, విజయనగరం, గరివిడి, గుర్ల, గజపతినగరం, పాచిపెంట, గుమలక్ష్మిపురంలలో 6 సెంటీమీటర్లుగా నమోదైంది. ఎస్ కోట, గంట్యాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, తెర్లాం, రామభద్రాపురం, సాలూరు, పార్వతీపురం, గరుగుబిల్లిల్లో 5 సెంటీ మీటర్లు.. దత్తిరాజేరు, బాడంగి, బొబ్బిలి, జేఎం వలసలలో 4 సెంటీమీటర్లు.. కురుపాం, మక్కువ, సీతానగరం, బలిజిపేటలలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతలం నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top