 
													సాక్షి, అమరావతి: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 6.1సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 4.9, అనకాపల్లి జిల్లా చోడవరంలో 4.8సెం.మీ. వర్షపాతం కురిసింది.
గురువారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం అల్లూరి,ఏలూరు,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో pic.twitter.com/KZS1LMcGFf— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 10, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
