Pudami Sakshiga: ‘సాక్షి’ పుడమి పరిరక్షణ వాక్‌

Pudami Sakshiga: Environment Awareness Rally At Vizag RK Beach

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణకు నడుంబిగించిన ‘సాక్షి’

సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణకు ‘సాక్షి’ యాజమాన్యం ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలంటూ పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడలో పుడమి సాక్షిగా వాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ర్యాలీ గుణదల పడవల రేవు సెంటర్‌ నుంచి మధురానగర్‌ సర్కిల్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్‌ కాంతిరాణా టాటా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ  వాక్‌లో వైఎస్సార్‌ పీపీ నేతలతో పాటు పెద్ద ఎత్తున యువతీ యువకులు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భావితరాలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే పర్యావరణ పరిరక్షణే అని సీపీ కాంతిరాణా టాటా అన్నారు.

చదవండి: ఆ గ్రామం ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.. 

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి పరిరక్షణకు ‘సాక్షి మీడియా’ నడుంబిగించింది. పుడమినీ పరిరక్షించుకునేందుకు యువతరం బాధ్యతగా వ్యవహరించాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కోరారు. విశాఖలోని ఆర్కే బీచ్ కాళీ మాత టెంపుల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో ‘పుడమి సాక్షి’గా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ ఐజి కాళిదాసు వెంకటరంగారావు కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు కూడా హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top