
సాక్షి, అమరావతి: ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ‘ప్రాజెక్ట్ టీల్’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్ గురువారం తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర వైద్య శాఖ ప్రవేశపెట్టిందన్నారు. డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లు ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్ట్ టీల్‌లో భాగంగా పీహెచ్‌సీ నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని ఆస్పత్రుల్లోని ప్రముఖ ప్రదేశంలో ముదురు నీలం–ఆకు పచ్చ లైటింగ్‌ను ప్రదర్శించాలన్నారు.