విశాఖ భూముల టెండర్ల ప్రక్రియ కొనసాగించవచ్చు

Process of tenders for Visakhapatnam lands can be continued - Sakshi

ఖరారు చేయవద్దు

హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల వేలం విషయంలో టెండర్ల ప్రక్రియను కొనసాగించవచ్చని, అయితే టెండర్లను మాత్రం ఖరారు చేయవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ డైరెక్టర్, ఎన్బీసీసీ సీఎండీ, ఏపీఐఐసీ ఎండీ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నంలో భూముల వేలాన్ని అడ్డుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top