శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు

Polavaram Project works in jet speed, New hope over timely completion - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కలల ప్రాజెక్ట్ పోలవరం. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రంలో సగం జనాభాకు సాగు, తాగునీటి సమస్యలు ఉండవు. దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నది ప్రజల చిరకాల వాంచ. దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  పోలవరాన్ని ఏటీఎంలా వాడేశాడన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇక అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా ఏకంగా పోలవరం పూర్తి చేస్తాం అంటూ అసెంబ్లీలో తొడగొట్టారు. కానీ పూర్తి చేసి చూపించలేకపోయారు.  పోలవరానికి రూ.2,234.288 కోట్లు విడుదల

స్వయంగా దేశ ప్రధాని మోదీ కూడా చంద్రబాబు ప్రభుత్వం పోలవరంను ఏటీఎంలా వాడేసిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవి. ఇప్పుడు వైఎస్‌ జగన్ ప్రభుత్వం వచ్చాక.. పోలవరం పనులు మేఘా చేపట్టాక వాయువేగంతో పనులు నడుస్తున్నాయి. కరోనా వచ్చినా.. వరదలు ముంచెత్తినా పనులు మాత్రం ఆగకుండా కమిట్ మెంట్ తో సాగుతున్నాయి. రాత్రి పూట కూడా పనులు జరుగుతున్నాయి. అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే యూనిక్యూ మెషీన్లను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ సంస్థ వాడుతూ పనులు పూర్తి చేస్తోంది. డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకెళుతోంది.  ఏపీ వాదనకు పీపీఏ మద్దతు

పోలవరం పనులను చంద్రబాబు సర్కార నత్తకు నడక నేర్పేలా చేస్తే.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను చిరుత వేగంతో పూర్తి చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఈ సంవత్సర కాలంలో స్పిల్ వేను శరవేగంతో పూర్తి చేస్తోంది. అంతకు ముందు పియర్స్ ఎత్తు సరాసరి 28 మీటర్లు ఉంటే.. ఇప్పుడు 52 మీటర్లు కు నిర్మాణం పూర్తి కావడం విశేషంగా చెప్పొచ్చు.  ఇప్పటికే 171 గడ్డర్లు నిర్మాణం పూర్తి అయ్యింది.  గడ్డర్లు నిర్మాణం పూర్తి అవ్వడమే కాకుండా దాదాపు 84 గడ్డర్లును స్పిల్ వే పియర్స్ పై పెట్టి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించింది. 10పియర్స్ పై బ్రిడ్జి శ్లాబు నిర్మాణం దాదాపు 250మీటర్లు పూర్తి అయ్యింది.  మిగతా పియర్స్ మీద గడ్డర్ల ఏర్పాటుతో పాటు, షట్టరింగ్ వర్క్, స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.  

గేట్లు ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీంల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తయ్యింది. పూర్తి అయిన ట్రూనియన్ భీంల దగ్గర గేట్లు ఏర్పాటుకు సంబందించిన ప్రిలిమినరీ పనులు జరుగుతున్నాయి.స్పిల్ వేలో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.  స్పిల్ ఛానెల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయి.అయితే జూన్ నుండి స్పిల్ ఛానెల్‌లోకి వరద నీరు రావటంతో పనులు నిలిచిపోయాయి. వరద నీరు తోడటం ప్రారంభించి త్వరలోనే మట్టి తవ్వకం పనులు,కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సీజన్ లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు.

గ్యాప్-1 ఢయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. 2కాలమ్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యాయి.  గ్యాప్-3లో మట్టి తవ్వకం పనులు,కొండ రాయి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. కీలకమైన 902కొండ తవ్వకం పనులను 1,88,623 క్యూబిక్  మీటర్లు పూర్తి అయ్యాయి. వరదల వల్ల పాడైపోయిన ఎగువ కాఫర్ డ్యామ్‌ నిర్మాణ పనులును సైతం వేగం చేసింది మేఘా సంస్థ. కరోనా కాలంలో.. గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ పోలవరంను పరుగులు పెట్టిస్తుండడం విశేషంగా మారింది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి. ముఖ్యమంత్రి పట్టుదల.. మేఘా పనితనంతో ఏపీ ప్రజల చిరకాల వాంచ, కలల ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది. సకాలంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సిద్ధం అవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top