పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు తీవ్ర అస్వస్థత 

Polavaram MLA Balaraju Is A Serious Illness - Sakshi

బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉన్న బాలరాజు జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బాలరాజుకు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి రిఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను రాజమండ్రిలోని సాయి ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెకు స్టంట్‌ అమర్చారు.

ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు పరామర్శించారు.
చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top