ట్యూషన్‌ మాస్టారిపై పోక్సో కేసు | pocso case against tuition master: prakasam district | Sakshi
Sakshi News home page

ట్యూషన్‌ మాస్టారిపై పోక్సో కేసు

Nov 4 2024 5:51 AM | Updated on Nov 4 2024 6:14 AM

pocso case against tuition master: prakasam district

వేటపాలెం: ట్యూషన్‌కి వెళ్లిన విద్యార్థినిపై ట్యూషన్‌ మాస్టరు అసభ్యంగా ప్రవర్తించాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చల్లారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆవుల వెంకటప్రసాద్‌ జాండ్రపేట హైస్కూల్‌ దగ్గరలో ట్యూషన్‌ నడుపుతున్నాడు. ఆ ట్యూషన్‌కి దేశాయిపేట పంచాయతీకి చెందిన ఆటో డ్రైవర్‌ ఇద్దరు కుమార్తెలు వెళ్తుంటారు.

అయితే.. చిన్నకూతురితో ట్యూషన్‌ మాస్టారు నెల రోజులుగా అసభ్యంగా మాట్లాడుతూ, శరీరంపై చేతులు వేస్తూ వేధించసాగాడు. ఆదివారం కూడా ఇలాగే చేస్తూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తన అక్కకు, తోటి బాలికలకు తెలిపింది. అందరూ కలసి టీచర్‌ను నిలదీశారు. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్యూçషన్‌ మాస్టారు ఆవుల వెంకటప్రసాద్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement