-
13 ఏళ్ల బాలుడిని పెళ్లాడిన ట్యూషన్ టీచర్.. చివరికి
జాతకంలో ఏదైనా దోషం ఉంటే నివారణకు పూజలు, హోమాలు జరిపించడం పరిపాటి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఏర్పడిన దోషాన్ని తొలగించేందుకు నానా హంగామా చేస్తుంటారు. అయితే పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. జాతకంలో మాంగళ్య దోషం ఉందని 13 ఏళ్ల వయసున్న స్టూడెంట్ను వివాహం చేసుకుంది ఓ ట్యూషన్ టీచర్. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగు చూసింది. బస్తీ బావా ఖేల్ ప్రాంతంలోని ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఎంతకీ వివాహం కుదరకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పూజారిని సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సంబంధిత యువతి పుట్టిన జాతకం ప్రకారం ఆమెకు మాంగళ్య దోషం ఉందని పూజారి పేర్కొన్నాడు. దీని నివారణకు ఆమెకు మైనర్ బాలుడితో ముందుగా పెళ్లి చేయాలని సూచించాడు. ఈ క్రమంలో మహిళా తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చే ఓ విద్యార్థుల్లోని 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసేందుకు సిద్ధపడింది. ట్యూషన్ క్లాసుల కోసం బాలుడు తన వద్దే వారం పాటు ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఒప్పించింది. 7 రోజులపాటు విద్యార్థిని టీచర్ తన ఇంట్లో పెట్టుకొని పెళ్లి వేడుకలు నిర్వహించారు. అనంతరం తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపించేసింది. వారం తర్వాత ఇంటికొచ్చిన బాలుడు తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుని నిర్భందించి బలవంతంగా హల్దీ వేడుక, మొదటి రాత్రి వంటి ఆచారాలను నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే మహిళ ఒత్తిడి మేరకు బాధితుడి కుటుంబం ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయం చివరికి సీనియర్ పోలీసు అధికారుల వరకు చేరడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన డీఎస్పీ గుర్మీత్ సింగ్ పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. బాలుడు మైనర్ కావడంతో లోతుగా దర్యాప్తు చేయాలని, అతన్ని నిర్భంధంలో ఉంచడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ సదరు టీచర్‌పై, ఆమె తల్లిదండ్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
విద్యార్థినులపై వేధింపులు.. ట్యూషన్ మాస్టర్‌పై కేసు
చిలకలగూడ: విద్యార్థినులను వేధిస్తున్న ట్యూషన్ మాస్టర్‌పై కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడకు చెందిన వికలాంగుడైన గాంధీప్రసాద్ (28) ట్యూషన్ మాస్టర్. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు (17) ఆరునెలల క్రితం ట్యూషన్లో చేరారు. కొన్ని రోజులుగా గాంధీప్రసాద్ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇంటర్ బోర్డులో ఓ ఉన్నతాధికారి తన స్నేహితుడని, మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించసాగాడు. అతడి వేధింపులు భరించలేక విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. శుక్రవారం రాత్రి బాధితుల ఫిర్యాదు మేరకు గాంధీప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
తలసేమియాపై అవగాహన
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
పంజాబ్‌కు బ్రేకులు వేసిన సీఎస్కే
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement