విద్యార్థినులపై వేధింపులు.. ట్యూషన్ మాస్టర్‌పై కేసు | Sexual harassment on the female students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులపై వేధింపులు.. ట్యూషన్ మాస్టర్‌పై కేసు

Nov 16 2014 1:16 AM | Updated on Jul 23 2018 9:13 PM

విద్యార్థినులపై వేధింపులు.. ట్యూషన్ మాస్టర్‌పై కేసు - Sakshi

విద్యార్థినులపై వేధింపులు.. ట్యూషన్ మాస్టర్‌పై కేసు

విద్యార్థినులను వేధిస్తున్న ట్యూషన్ మాస్టర్‌పై కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

చిలకలగూడ: విద్యార్థినులను వేధిస్తున్న ట్యూషన్ మాస్టర్‌పై కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడకు చెందిన వికలాంగుడైన గాంధీప్రసాద్ (28) ట్యూషన్ మాస్టర్. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు (17) ఆరునెలల క్రితం ట్యూషన్‌లో చేరారు. కొన్ని రోజులుగా గాంధీప్రసాద్ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఇంటర్ బోర్డులో ఓ ఉన్నతాధికారి తన స్నేహితుడని, మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించసాగాడు. అతడి వేధింపులు భరించలేక విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. శుక్రవారం రాత్రి బాధితుల ఫిర్యాదు మేరకు గాంధీప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement