విద్యార్థినిపై పీఈటీ టీచర్ దాష్టీకం.. కడ్డీతో చెంపపై కాల్చిన వైనం

సాక్షి, కర్నూలు: కొత్తపల్లిలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. ఆదర్శంగా ఉండాల్సిన టీచరే విద్యార్థి ని చెంపపై కడ్డీతో కాల్చింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి కేజీబీవీలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. చున్నీ వేసుకోకుండా తిరగడమే కాక తనను వేరే విద్యార్థినుల ముందు తిడతావా అని కీర్తిపై పీఈటీ టీచర్ పావని ఆగ్రహించింది.
అంతటితో వదలకపోగా శనివారం ప్రార్థన సమయంలో కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది. కీర్తికి గిట్టని ఓ విద్యార్థిని చెప్పిన మాటలను నమ్మి సదరు టీచర్ ఇలా చేసినట్లు సమాచారం. విద్యార్థిని తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.
చదవండి: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు