మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు.
ఈ క్రమంలో మంత్రికి కాన్వాయ్‌గా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుకు అటువైపున దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించి అనంతరం మంత్రి కాన్వాయ్‌కు మరమ్మతులను నిర్వహించి, అక్కడ నుంచి తిరుపతికి తరలించారు.