మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే: పెద్దపాటి అమ్మాజీ | Peddapati Ammaji Comments On Liquor Scam In TDP Time | Sakshi
Sakshi News home page

మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే: పెద్దపాటి అమ్మాజీ

Sep 4 2022 7:09 PM | Updated on Sep 4 2022 7:28 PM

Peddapati Ammaji Comments On Liquor Scam In TDP Time - Sakshi

సాక్షి, కాకినాడ: ఏపీలో మద్యం బ్రాండ్ల పేర్లకు టీడీపీ హయంలోనే అనుమతిచ్చారు. మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులేనని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌ పెద్దపాటి అమ్మాజీ మండిపడ్డారు.

కాగా, పెద్దపాటి అమ్మాజీ ఆదివారం తునిలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే. డిస్టిలరీలకు అనుమతులు కావాలంటే గతంలో భువనేశ్వరిని కలిసేవారని విన్నాను. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ఎలా బురద చల్లాలో తెలియక మద్యం స్కామ్‌ అంటూ బురద చల్లుతున్నారు. మద్యం బ్రాండ్ల పేర్లకు టీడీపీ హయంలోనే అనుమతి ఇచ్చారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement