చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి

Online Class on Mud Ganesha With Sakshi Media And Pollution Control Board

ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ 

మట్టి గణపతి కిట్‌ అందజేత

విజేతలకు బహుమతులు

సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు ఆది గురువైన సిద్ధి వినాయకుని పండుగ వచ్చేస్తోంది. వినాయక పండుగ నాడు మీరు పుస్తకాలు పూజలో ఉంచి.. గణపతికి ఇష్టమైన, మధురమైన పిండి వంటలు ఆరగింప జేసి.. మీ కోరికలు కోరే సమయం ఆసన్నమైంది. మీరు పూజించాల్సిన వినాయకుణ్ని మీరే మీ చిట్టిచేతులతో తయారుచేస్తే ‘గణాధిపతి’ ఎంతో సంతషించి వరాలనిస్తాడు. మాకు విగ్రహం తయారు చేయడం రాదని చింతించకండి. ‘‘పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహం...’’ తయారు చేసే విధానం గురించి సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో.. ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. 

ఈనెల 21(ఆగస్టు 21)వ తేదీన జరిగే మట్టి వినాయక విగ్రహం తయారీ ఆన్‌లైన్‌ శిక్షణలో 6 నుంచి 18 సంవత్సరాల వారందరూ ΄ాల్గొనవచ్చు. దీనికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నుంచి 12ఏళ్ల వయసు గల వారు మొదటి కేటగిరీగా... 13 నుంచి 18 సంవత్సరాల వయసుగల వారిని రెండో కేటగిరీగా పరిగణిస్తారు. ప్రతి కేటగిరీలో మొదటి మూడు బహుమతులతో΄ాటు ఐదు కన్సోలేషన్‌ బహుమతులు గెలుచుకోవచ్చు. 

రిజిస్టర్‌ ఇలా:దిగు వ ఇచ్చిన వాట్సప్‌/ఈ మెయిల్‌ ఐడీకి మీ పేరు, తండ్రి పేరు, తరగతి, ΄ాఠశాల/ కళాశాల పేరు, పుట్టిన తేది, వయసు, అడ్రస్, జిల్లా, మొబైల్‌ నెంబర్‌ మొదలైన వివరాలు పంపి రిజస్టర్‌ చేసుకోవాలి. 

మట్టి గణపతి కిట్‌:రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల(ఆగస్టు) 18,19 తేదీల్లో నిర్దేశించిన సాక్షి ఆఫీసు ద్వారా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మట్టి గణపతి కిట్‌(బంకమట్టి, విత్తనాలు, శానిటైజర్‌) అందజేస్తారు. 

ఆన్‌లైన్‌ శిక్షణ: ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం గం.12:30 ని.లకు అనుభవజ్ఞులైన టీచర్‌ ద్వారా మట్టి వినాయకుణ్ని తయారు చేసే విధానాన్ని సాక్షి టీవీ, యూ ట్యూబ్‌ లింక్‌లో ప్రసారం చేస్తారు. ఆ ప్రసారం ద్వారా మీరు మట్టి విగ్రహం తయారీని నేర్చుకోవచ్చు. అలా తయారు చేసిన విగ్రహాన్ని ఫోటో తీసి.. అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు రిజస్టర్‌ చేసుకున్న వాట్సప్‌ నెంబర్‌కు, ఈ మెయిల్‌ ఐడీకి పంపించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆన్‌లైన్‌ శిక్షణలో ΄ాల్గొని.. మీ చేతులతో తయారు చేసిన మట్టి విగ్రహాన్ని పండుగ రోజున పూజించడంతో΄ాటు బహుమతులూ అందుకోండి!!
రిజిస్ట్రేషన్‌ కొరకు చివరి తేది : 17–08–2020
మీ పేరు రిజిస్టర్‌ చేసుకునేందుకు  వాట్సప్‌/ఈ–మెయిల్‌ ఐడీ:9666283534,  a.venkatarakesh@sakshi.com

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top