
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో ఎల్లో నేతలు.. మహిళల పట్ల కీచకుల్లా మారి పెట్రేగిపోతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో టీడీపీ నేత వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా వీఏవోగా పని చేస్తున్న మహిళను చిలుకూరు గ్రామ టీడీపీ నేత కాటేపల్లి సుబ్బారావు వేధిపులకు గురి చేస్తున్నారు.
సుబ్బారావు వేధింపులు తాళలేక డ్వాక్రా వీఏవో పురుగుల మందు తాగింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ఆమెపై డ్వాక్రా గ్రూపు సభ్యులతో దాడి చేయించేందుకు సుబ్బారావు యత్నించాడు. సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటోంది.