ఆ భూములపై రైతులకే హక్కులు.. 

NREDCAP key Announcement On Rayadurgam Solar Park Lands - Sakshi

రాయదుర్గం సోలార్‌ పార్క్‌ కోసం భూములను సేకరించడం లేదు 

అది లీజు అగ్రిమెంటు మాత్రమే 

కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమన్న నెడ్‌క్యాప్‌

సాక్షి, అమరావతి:  రాయదుర్గం సోలార్‌ పార్క్‌ కోసం రైతుల నుంచి భూములను సేకరించడం లేదని, ప్రభుత్వం కేవలం లీజు అగ్రిమెంట్‌ మాత్రమే చేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ నెడ్‌క్యాప్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.  

- రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులుంటాయి. ఎకరానికి ఏటా ఇచ్చే లీజును ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పెంచి రైతులకు సోలార్‌ పార్కు ద్వారా అధిక ఆదాయం సమకూరేలా చేసింది. రైతులకు ఇంత అధిక ఆదాయం వచ్చేలా చేస్తుంటే ప్రతిపక్షం రైతులకు ద్రోహం చేసేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం.  

- రైతుల ఆదాయం పెంచేలా ప్రభుత్వం పాలసీ తెచ్చింది. రైతుల నుంచి లీజుకు తీసుకునే భూమికి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు చెల్లించడమే కాకుండా ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచుతుంది. భూములను లీజుకు తీసుకోవడంలో నెడ్‌క్యాప్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రైతులు పూర్తిగా అంగీకారం తెలిపాకే లీజుకు తీసుకుంటోంది.  రాష్ట్రంలో నాలుగు సోలార్‌ పార్కులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్పీసీఎల్‌) జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటైంది. 

- నెడ్‌క్యాప్‌ అనుభవం లేని సంస్థ అనడంలో అర్థంలేదు. నెడ్‌క్యాప్‌ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. దీర్ఘకాలంగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top