చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే  | Nine cooperative sugar factories closed during Chandrababu tenure | Sakshi
Sakshi News home page

చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే 

Feb 29 2024 5:01 AM | Updated on Feb 29 2024 9:44 AM

Nine cooperative sugar factories closed during Chandrababu tenure - Sakshi

చంద్రబాబు హయాంలో పదింటికి తొమ్మిది సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి

వీటిలో లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలూ ఉన్నాయి

ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలూ మూతపడ్డాయి

వేలాది చెరుకు రైతులు, వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు

మూతపడిన 4 ఫ్యాక్టరీలను తెరిపించిన వైఎస్సార్‌

రైతులు, ఉద్యోగులకు రూ.వందల కోట్లు బకాయి పెట్టిన బాబు

మూతపడ్డ కర్మాగారాలను తిరిగి వినియోగంలోకి తెస్తున్న సీఎం జగన్‌

ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఉపసంఘం

బాబు ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.346.47 కోట్లు రైతులకు చెల్లింపు

ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్లో రూ.72.86 కోట్లు చెల్లింపు

సామర్థ్యానికి సరిపడా చెరుకు ఉత్పత్తి కాని పరిస్థితి

ఫ్యాక్టరీలను ప్రాసెసింగ్‌ యూనిట్లుగా మార్చి రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం

వాస్తవాలు తెలుసుకోకుండా ‘ఈనాడు’ బురద రాతలు

సాక్షి, అమరావతి: ఎవరైనా ఓ మాట చెబితే దానికో హేతుబద్ధత ఉండాలి. కానీ, రామోజీ మాటలకు రోత పద్ధతే తప్ప హేతుబద్దత ఉండదు. ఇందుకు చక్కెర కర్మాగారాలపై ఈనాడు ప్రచురించిన కథ­నమే ఇందుకు నిదర్శనం. అసలు రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను నమిలి, పీల్చి పిప్పి చేసిందే రామోజీ ప్రియ మిత్రుడు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో ఫ్యాక్ట­రీలు మూతపడ్డాయి. ఎందరో చెరుకు రైతులు కుదే­లై­పోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డు­న పడ్డాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తర్వాత సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగా­రాల పునరుద్ధరణకు చిత్త­శుద్ధితో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర­కు అధి­కారంలోకి వచ్చీరాగానే వీటి పునరుద్ధర­ణకు ఉప సంఘం వేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకా­యిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించారు. మూత­బడ్డ కర్మాగారాల్లో క్రషింగ్‌ ప్రారంభించేందుకు చర్య­లు చేపట్టారు.

క్రషింగ్‌ సామర్థ్యానికి తగిన­ట్టుగా చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించారు. రైతు­లకు ఇంతలా మంచి జరిగితే తట్టుకోలేని విప­క్షాలు కోర్టును ఆశ్రయించి అడ్డుకు­న్నాయి. ఈ వాస్త­వా­లను విస్మరించి ఈనాడు పత్రి­కలో ‘‘తీపి మాటలు చెప్పి పీల్చి పిప్పి’ అంటూ రామో­జీ మరో రోత కథ అచ్చేశారు. ఈ కథ­నంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలి­ద్దాం..

ఆరోపణ: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టారు
వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎన్‌వీఆర్‌ జంపని సహకార చక్కెర కర్మాగా­రా­లను దివంగత మహానేత వైఎస్సార్‌ అధికార­ంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే వాటిని మళ్లీ చంద్ర­­బాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూ­రు, ఎన్‌వీఆర్‌ జంపని చక్కెర కర్మాగా­రా­లను తన అను­యా­యులకు కట్టబెట్టే లక్ష్యంతో వాటి­ని నిర్వీర్యం చేసి 2003–04లోనే మూత పడేలా చేశారు.

ఫలితంగా పదింటికి తొమ్మిది మూత­పడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగా­రాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి చేరాయి. ఇదంతా బాబు చేసిన పాపాల ఫలితమే.

ఆరోపణ: రైతులను ఆదుకోని వైఎస్సార్‌సీపీ సర్కారు?
వాస్తవం: బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 72.86 కోట్లు చెల్లించింది. మరొక వైపు ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగా­రాల పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, సామ­ర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది.

సగటున రోజుకు 17,750 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో ఈ కర్మాగారాలకు కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడంలేదు. పైగా వీటిలోని యంత్ర పరికరాలన్నీ మూలపడి శిథిలావస్థకు చేరుకు­న్నాయి. ముడిì సరుకు లేకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి ఆధునికీకరించడం వలన ఫలితమే­మిటో రామోజీకే తెలియాలి.

ఆరోపణ: చెరుకు రైతులకుప్రోత్సాహం కరువు
వాస్తవం: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెరుకు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఆర్థిక చేయూ­త అందిస్తోంది. ఓ వైపు రాయితీలు, ప్రోత్సాహ­కా­లతో పాటు..  వైఎస్సార్‌ రైతు భరోసా కింద చెరుకు రైతులకు సైతం ఏటా మూడు విడ­తల్లో రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయం అందిస్తోంది.

పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మెజార్టీ రైతులు ప్రత్యా­మ్నా­య పంటల వైపు మళ్లా­రు. ఫలితంగా ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరుకు.. ప్రస్తు­తం (2023–24)లో 41 వేల హెక్టార్లకు పడి­పోయి, 23.65 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది.

ఆరోపణ: రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం?
వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరుకు లేక క్రషింగ్‌ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాలన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభు­త్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని భావి­ంచింది.

కర్మాగారాల ఆస్తులు, స్థలా­­లపై లీజుకు తీసుకునే సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్ప­ష్టం. అయితే, మూత­పడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వ ప్రయ­త్నం కార్య­రూ­పం దాల్చలేదు. అలాంటప్పుడు వేల కోట్ల విలువైన వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారో రామోజీనే చెప్పాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement