చదువంటే ఇష్టం.. కాన్పు కోసం వెళ్లి.. కనులారా కన్న పేగును చూసుకోకుండానే..

New born baby and woman died in Mantralayam - Sakshi

సాక్షి, మంత్రాలయం: ఆ తల్లి కన్న కలలు తీరకుండా తీరని లోకాలకు వెళ్లింది. కనులారా కన్న పేగును చూసుకోకుండానే కన్నుమూసింది. పేగు తెంచుకుని పుట్టిన నవజాత శిశువు (బాబు) సైతం క్షణాల్లోనే ఊపిరి వదిలాడు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలచివేసింది. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరి, భీయమ్మ కూతురు చాంద్‌బీని పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దస్తగిరికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు.

చదువుపై మక్కువ ఉండటంతో చాంద్‌బీ పత్తికొండ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. తొలి కాన్పు కోసం పుట్టిల్లు రచ్చమర్రికి వచ్చింది. గురువారం చాంద్‌బీకి నొప్పులు మొదలు కావడంతో ఆదోనికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ కాన్పు జరిగింది. అయితే కాన్పు సమయంలో బ్లడ్‌ ప్రెజర్‌ (బీపీ) పెరిగి శిశువుకు పురుడు పోయగానే భయంతో ప్రాణాలు కోల్పోయింది. శిశువు సైతం మూడు నిమిషాల వ్యవధిలోనే ఊపిరి వదిలాడు. మొదటి కాన్పులోనే ఇద్దరు మృత్యువాత పడటంతో ఇంటిల్లిపాది శోక సంద్రంలో మునిగారు.   

చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top