సాక్షి, నెల్లూరు జిల్లా: చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఛైర్మన్ సతీష్ యాదవ్ కామలీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళతో గెస్ట్ హౌస్‌లో ముగ్గురు టీడీపీ నేతలు కలిసి గానా బజానా దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.
బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ బట్టలు విప్పి నాగినీ డ్యాన్స్ వైరల్‌గా మారింది. టీడీపీ నేతలు రోజురోజుకు దిగజారిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర ఆలయ ఛైర్మన్లు అసభ్యకరమైన నృత్యాలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
కాగా, అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కామకేళీలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మరచిపోయి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్‌లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.
ఇటీవలే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం ఇటీవల కలకలం రేపాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వ్యవహారాలు బయట పడుతున్నాయి.
నెల్లూరు చిన్నబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీల్లో నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈయన టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు. చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూడా.



