
సాక్షి, ఐతవరం : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. కాగా, వరదల కారణంగా కృష్టా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో దాదాపు 24 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీ కూడా విజయవాడ-హైదరాబాద్ మధ్య రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసింది.
ఇక, తాజాగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనల రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరద తగ్గడంతో వాహనాలను పోలీసులు అనుమతించారు. కాగా, అంతకుముందు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించారు.
ఇది కూడా చదవండి: బోరుమంటున్న మొరంచపల్లి.. సర్వం కోల్పోయిన దీనస్థితి..