కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య భేటీ

Mp R Krishnaiah Meet Union Home Minister Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వినతించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని అమిత్‌షా అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, జాతీయ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఆర్‌.కృష్ణయ్య కోరారు. భేటీ అనంతరం ఆర్‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలో 2,640 బీసీ కులాలున్నాయి. కుల, చేతి, సేవా వృత్తులు పోయాయి. యంత్రాలు, పరిశ్రమలు, గ్లోబలైజేషన్‌, ఇండస్ట్రీయలైజేషన్‌తో పెనుమార్పులు సంభవించాయన్నారు.
చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top